అరవింద సమేతలో అమితాబ్ బచ్చన్?

Tuesday,September 11,2018 - 06:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్ లో చక్కర్లు కొడతున్న హాట్ హాట్ గాసిప్ ఇది. అవును.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద్ సమేత సినిమాలో బిగ్ బి కూడా ఉన్నారట. ఈ కీలక పాత్రలో అమితాబ్ ఇలా వచ్చి అలా మెరుస్తారంటూ టాలీవుడ్ లో ఓ రూమర్ నడుస్తోంది. యూనిట్ నుంచి మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.

ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు అమితాబ్. మనం సినిమా తర్వాత ఆయన చేస్తున్న తెలుగు సినిమా ఇదే. ఈ మూవీతో పాటు అరవింద సమేతలో కూడా ఆయన గెస్ట్ రోల్ లో కనిపిస్తారట. పేరుకు ఇది అతిథి పాత్రే అయినప్పటికీ, ఒక్క సీన్ లోనే కనిపించినప్పటికీ, చాలా కీలకమైన రోల్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రస్తుతం అరవింద సమేత షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఎన్టీఆర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ హై-బడ్జెట్ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా అరవింద సమేతంగా థియేటర్లలోకి రానున్నాడు వీరరాఘవ.