అల్లు అర్జున్ ని లేడీ గెటప్ లో చూస్తారా...?

Friday,August 24,2018 - 03:53 by Z_CLU

అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా ‘గంగోత్రి’ లోనే లేడీ గెటప్ వేసి ఇంప్రెస్ చేసేశాడు బన్ని. ఆ గెటప్ లో సునీల్ ని ఆట పట్టించే సన్నివేశాలు సినిమాలోనే హైలెట్ గా నిలిచాయి. తను చేసే ప్రతి సినిమాలో డిఫెరెంట్ లుక్స్ ని ప్లాన్ చేసుకునే బన్ని కరియర్ లో ఈ లేడీ గెటప్ ఎప్పటికీ సమ్ థింగ్ స్పెషలే…

ఒక్క బన్ని విషయంలోనే కాదు, టాలీవుడ్ హీరోలు జస్ట్ యాక్షన్, రొమాన్స్ కే పరిమితం కాలేదు. సిచ్యువేషన్ డిమాండ్ చేయాలే కానీ, లేడీ గెటప్ లో కూడా హీరోయిన్స్ కి ధీటుగా సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేశారు. ఈ వరసలో మెగాస్టార్ దగ్గర నుండి బిగిన్ అయితే కమెడియన్ ఆలీ వరకు ఎవరికీ వారే సాటి అనిపించుకున్నారు.