శ్రీ విష్ణు ఇంటర్వ్యూ

Tuesday,December 05,2017 - 04:51 by Z_CLU

రీసెంట్ గా వివేక్ డైరెక్షన్ లో తెరకెక్కి డీసెంట్ హిట్ అనిపించుకున్న ‘మెంటల్ మది’ లో మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు మూవీ హీరో శ్రీ విష్ణు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ మూవీ ఎక్స్ పీరియన్సెస్ తో పాటు, తన ఫ్యూచర్ సినిమాల గురించి చెప్పుకున్నాడు. ఆ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీకోసం…

సక్సెస్ బావుంది….

ఏ నటుడికైనా చేసిన పనికి అప్రీసియేషన్ వచ్చినప్పుడే హ్యాప్పీగా అనిపిస్తుంది. చిన్న సినిమాగా రిలీజై నిర్మాతకు లాభాలు వచ్చాయంటే ఇంకా హ్యాప్పీ… నా కరియర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ చేసిన సినిమా ఇదే…

అలా జరిగింది…

‘అప్పట్లో ఒకడుండేవాడు’ తరవాత రాజు గారు వివేక్ ని పంపి ఈ స్టోర్ వినమన్నారు. కతవినేతపుడు ఫస్ట్ 10 నిమిషాల్లోనే వివేక్ తో నేనీ సినిమా చేస్తున్నాను అని చెప్పాను.. ఆ తరవాత తక్కిన కథ విన్నాను….

అదొక్కటే రూల్..

ఒక సినిమాలో కనిపించినట్టు ఇంకో సినిమాలో ఉండకూడదు అనేదే నాకుగా నేను పెట్టుకున్న రూల్. అది కాకుండా నేను చేయగలను అనిపిస్తే ఏ క్యారెక్టర్ అయినా చేసేస్తాను….

ప్రతిచోటా ఉంటుంది…

కన్ఫ్యూజన్ అనేది ప్రతిచోటా ఉంటుంది. ప్రతి ఒకరిలో ఉంటుంది… కానీ సినిమాలో ఈ పాయింట్ ని డిస్కస్ చేయడం కొత్తగా అనిపించింది. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ బిగినింగ్ నుండి ఉంది…

 

అదే నా పాలసీ…

స్క్రిప్ట్ బావుందనగానే సినిమా చేసేయను.. ఆ స్టోరీ, క్యారెక్టర్ నాకు సూట్ అవ్వాలి… అప్పుడే సినిమా చేస్తా… లేకపోతే నా వల్ల అనవసరంగా సినిమా ఫ్లాప్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఒక సినిమా అంటే దాని వెనక పెద్ద టీమ్ ఉంటుంది. టీమ్ ఎఫర్ట్స్ ఉంటాయి. సినిమా ఫ్లాప్ అయిందంటే నాతో పాటు వాళ్ళ కరియర్ కూడా పోతుంది. కాబట్టి అవన్నీ మైండ్ లో పెట్టుకునే డెసిషన్ తీసుకుంటాను..

ప్రతీ క్యారెక్టర్ కనెక్ట్ అయింది…

సినిమాని చాలా న్యాచురల్ గా ప్లాన్ చేశాం. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ న్యాచురల్ గా ఉంది కాబట్టే తక్కిన క్యారెక్టర్స్  కూడా అంతే ఈజీగా కనెక్ట్ అయిపోయాయి. హీరోయిన్ క్యారెక్టర్ తో పాటు శివాజీ రాజా గారి క్యారెక్టర్స్ కి చాలా అప్రీసియేషన్స్ వస్తున్నాయి.

చాలా మారిపోయింది…

కరియర్ బిగినింగ్ లో అందరిలాగే నాక్కూడా ఆప్షన్స్ ఎక్కువగా లేవు. ఏ అవకాశం వస్తే ఆ సినిమా చేసేయాలి. కానీ ఇప్పుడలా కాదు.. అవకాశాలు వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు నాకు తగ్గ సినిమా, నాకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ ఎంచుకోవడానికి చాన్స్ ఉంది.

అదే ఆ సినిమా…

వీర భోగ వసంత రాయలు – బ్రహ్మం చెప్పారు…  సమయం వచ్చినపుడు చెడును అంతం చేయడానికి ఒకడు పుడతాడు. వాడే వీర భోగ వసంత రాయలు అని.. అలాగే ఈ సినిమాలో కూడా ఎవడికి వాడు వీర భోగ వసంతరాయలు అని ఫీల్ అవుతుంటాడు… అదే ఆ సినిమా..

నెక్స్ట్ వెంచర్స్

నీది నాది ఒకే కథ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక వీర భోగ వసంత రాయలు తో పాటు రీసెంట్ గా అసుర మూవీ చేసిన విజయ్ డైరెక్షన్ లో ‘తిప్పరా మీసం’ సినిమా చేస్తున్నాను.

నచ్చినదైతే అదే…

ఆక్చువల్ గా నా గోల్ యాక్టింగ్ కన్నా డైరెక్టర్ అవ్వాలన్నదే.. అనుకోకుండా యాక్టర్ అయ్యాను కాబట్టి ప్రస్తుతానికదే కంటిన్యూ చేస్తున్నా.. ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తా…