సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మహానటి టీమ్

Tuesday,December 05,2017 - 03:06 by Z_CLU

మహానటి సావిత్రి బర్త్ డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ సర్ ప్రైజ్ తో రెడీ అవుతుంది మహానటి టీమ్. ఇప్పటికే ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసుకుంటున్న సినిమా యూనిట్, ఇప్పుడీ సర్ ప్రైజ్ తో సినిమాపై మరింత అటెన్షన్ ని గ్రాబ్ చేయనుంది.

హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన స్పెషల్ సెట్ తో పాటు, ఢిల్లీలోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, రేపు చేయబోయే సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఏమై ఉంటుందా అనే క్వశ్చన్ మూవీ లవర్స్ లోనే కాదు, సినీ వర్గాలలోను క్యూరాసిటీ రేజ్ చేస్తుంది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాలో సమంత కీ రోల్ ప్లే చేస్తుంది.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు S.V. రంగారావు గారి పాత్రలో నటిస్తున్నాడు. మరెంతో మంది స్టార్స్ తో సావిత్రి గారి లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ ఫేజ్ ని తెరకెక్కిస్తున్న నాగ అశ్విన్ అండ్ టీమ్ రేపటి కోసం ఏం సర్ ప్రైజ్ ప్లాన్ చేశారో ఇంకొన్ని గంటలు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.