స్పైడర్ టీజర్ రివ్యూ

Wednesday,August 09,2017 - 12:09 by Z_CLU

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా తెరకెక్కుతున్న స్పైడర్ హంగామా ఈరోజు నుంచి మరింత పెరిగింది. సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్పైడర్ టీజర్ విడుదల చేశారు. మహేష్ బాబు మేజిక్, మురుగదాస్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది స్పైడర్ టీజర్ లో.

“పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం, భూకంపం, సునామీలా నేను ఒక భాగమే” అంటూ విలన్ చెప్పే డైలాగ్ తో స్పైడర్ టీజర్ స్టార్ట్ అయింది. ఇన్నాళ్లూ ఓ నటుడు, దర్శకుడిగా మాత్రమే టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిన ఎస్ జే సూర్య.. టీజర్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.

ఇక టీజర్ లో క్లోజ్ షాట్ లో కనిపించి, తర్వాత తన స్టయిల్ ఆఫ్ రన్నింగ్ తో మహేష్ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. కేవలం హీరోకు మాత్రమే పరిచయం చేయకుండా విలన్, హీరోయిన్ ను కూడా చూపించి సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చింది స్పైడర్ టీం.

హరీష్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మెయిన్ హైలెట్ గా నిలవగా.. “భయపెట్టడం మాకూ తెలుసు” అంటూ మహేష్ చెప్పే పంచ్ డైలాగ్ తో టీజర్ ను గ్రాండ్ గా ముగించారు. ఓవరాల్ గా మహేష్ బర్త్ డే కానుకగా వచ్చిన స్పైడర్ టీజర్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలపై మరింత పెంచింది ఈ టీజర్.