సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న స్పైడర్ ట్రైలర్

Friday,September 15,2017 - 04:34 by Z_CLU

నిన్న రిలీజైన స్పైడర్ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అప్పుడే 2 లక్షల వ్యూస్ ని క్రాస్ చేసిన ఈ సినిమా ట్రేలర్, గంట గంటకి వ్యూస్ ని పెంచుకునే పనిలో పడింది. మహేష్ బాబు ఇంటలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ట్రెండింగ్ ఎలిమెంట్ లా మారింది.

మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కింది. S.J. సూర్య విలన్ గా నటించాడు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.