2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన స్పైడర్ టీజర్

Wednesday,August 09,2017 - 06:04 by Z_CLU

సోషల్ మీడియాని స్పైడర్ మానియా రూల్ చేస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజైన టీజర్ జస్ట్ గంటల్లో ఏకంగా 2 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ రోజు మార్నింగ్ ఈ టీజర్ చుట్టూ క్రియేట్ అయిన క్రేజ్ చూస్తుంటే ఈ సినిమాకి ఏ రేంజ్ లో డిమాండ్ క్రియేట్ అయి ఉందో తెలిసిపోతుంది.

 

డైరెక్టర్ మురుగదాస్ మార్క్, మహేష్ బాబు స్టైల్ ఆఫ్ లుక్స్, కేవలం 1:10 వ్యవధిలో సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తున్న ఈ టీజర్ గంట గంటకి ఇంకా వ్యూస్ ని పెంచుకునే పనిలో ఉంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ స్టూడెంట్ గా కనిపించనుంది. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.