జగపతిబాబు ఇంటర్వ్యూ

Wednesday,August 09,2017 - 10:00 by Z_CLU

ప్రెజెంట్ టాలీవుడ్ లో స్టైలిష్ విలన్, ఫాథర్ క్యారెక్టర్స్ తో దూసుకుపోతున్న జగపతిబాబు కీ రోల్ లో నటించిన మూవీ ‘జయ జానకి నాయక’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లో రానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు జగపతి బాబు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

 

పటేల్ SIR విషయంలో అదే పెద్ద మిస్టేక్

పటేల్ SIR విషయంలో ఓ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా.. ఆ సినిమా విషయంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ తప్పయింది. అది ఎప్పుడైతే ఎస్సెట్ అయ్యిందో అదే సినిమాకు పెద్ద మైనస్ అయింది. ఆ టీజర్ చూసి అందరు చాలా అంచనాలతో థియేటర్స్ కొచ్చారు. బిర్యాని తిందామనుకునే వాళ్ళకి మీల్స్ పెడితే సరిపోదు కదా అదే జరిగింది. ఏదో ఊహించిన వచ్చిన ఆడియన్స్ సినిమా చూసి నిరుత్సాహ పడ్డారు. సరిగ్గా కథానాయకుడు విషయంలో కూడా అదే జరిగింది. అందరూ రజిని కోసం ఆ సినిమా కి వస్తే నేనెక్కువగా కనిపించాను. సో పెళ్ళికొడుకును చూడడానికొస్తే తోడు పెళ్ళికొడుకు సందడేంటి అన్నట్టుగా ఫీలయ్యారు ఆడియన్స్. సో ఎలాంటి అంచనాలు లేకుండా వస్తే ఆ సినిమా కనెక్ట్ అయ్యివుండేదని నా ఫీలింగ్.

 

అది మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయలేం

లెజెండ్ సినిమా తర్వాత శ్రీను డైరెక్షన్ లో నేను నటించిన సినిమా ఇది. లెజెండ్ లో క్యారెక్టర్ చాలా పీక్స్ లోకి వెళ్లిపోయింది. మళ్ళీ నాకు సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్ద బూస్ట్ ఇచ్చిన క్యారెక్టర్ అది. అన్ని సార్లు అలాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ క్యారెక్టర్ కంపేర్ చేయలేం కానీ మళ్ళీ మరో మంచి క్యారెక్టర్ అనే చెప్పాలి.


శ్రీను కి కాన్ఫిడెంట్ ఎక్కువ

లెజెండ్ సినిమాలో నా క్యారెక్టర్ బాగా పేలుతుందని శ్రీను నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. మళ్ళీ మీ క్యారెక్టర్ బాగా పేలుతుందని శ్రీను పదే పదే చెప్తుండేవాడు. పరువు అంటే ప్రాణంలా ఫీలయ్యే క్యారెక్టర్ ఇందులో చేశాను.

 

అవన్నీ పట్టించుకోను

నేను చేసేది స్టార్ హీరో సినిమాలోనా.. యంగ్ హీరో సినిమాలోనా అని ఎప్పుడు పట్టించుకోను కేవలం నా క్యారెక్టర్ బాగుందా.. స్టోరీ బాగుందా అని మాత్రమే ఆలోచిస్తాను. అవన్నీ పట్టించుకుంటే సినిమాలేవీ చేయలేం.

 

రూల్స్ బ్రేక్ చేస్తా

విలన్ గా రే ఎంట్రీ ఇవ్వలనుకుంటున్న టైంలో కొందరు విలన్ గా అంటే నువ్వు సూట్ అవ్వవు, లావు అవ్వాలి ఇలా హీరోలా ఉంటె కష్టం అన్నారు. అప్పుడనిపించింది విలన్ అంటే బాగోకూడదా.. వాడి మైండ్ సెట్ బాడ్ గా ఉండాలి కానీ వాడేలా ఉంటె ఏంటి.. అని బేసిక్ గా రూల్స్ ని బ్రేక్ చెయ్యడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అందరూ వద్దన్నా లెజెండ్ లో స్టైలిష్ లుక్ మైంటైన్ చేశాను.

 

ఇంకా జరుగుతున్నాయి.

నటుడిగా నాలుగు లాంగ్వేజ్ లో నటించాను.. ప్రెజెంట్ బాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టాను. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు కొన్ని డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు చేస్తానో తెలియదు కానీ. కచ్చితంగా మాత్రం చేస్తాను.


ఆ తర్వాత నచ్చింది

ముందుగా ఈ సినిమాకు జయజనకి నాయక అనే టైటిల్ అనుకుంటున్నాం అని చెప్పారు. నాకు నోరు తిరగలేదు. ఆ తర్వాత బాగుందనిపించింది. ఇదొక క్యూట్ లవ్ స్టోరీ ఈ టైటిల్ అయితేనే సినిమాకు యాప్ట్ అనిపించి ఫైనల్ చేశారు. ముందు జయ వచ్చింది అంటే విజయం, జానకి అంటే అమ్మాయి పేరు, నాయక అంటే హీరో. సో అన్నీ కలిసొచ్చాయి.

 

యాక్షన్ ఎక్కువ లేదు

యాక్షన్ ఎక్కువ లేదు. బెల్లం కొండ శ్రీనివాస్ కి నాకు ఫైట్ అంటే కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో అందుకే డైరెకర్ చాలా తెలివిగా ప్లాన్ చేసి క్లైమాక్స్ లో కూడా నాకు శ్రీనివాస్ కి ఫైట్ లేకుండా కొత్తగా ప్లాన్ చేశాడు.

 

బిగ్ బి నే ఫాలో అవుతున్నా

ప్రస్తుతం నటుడిగా బిగ్ బి నే ఫాలో అవుతున్నాను. ఆయన వయసుతో సంబంధం లేకుండా కొత్త కొత్త క్యారెక్టర్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సో ఆయన్నే ఫాలో అవుతూ నటుడిగా కొత్త తరహా పాత్రలు వెతుకుంటూ ముందుకెళ్తున్నాను.

 

అది అవసరం లేదు

డై ఎందుకు వేసుకోవాలి అంటాను. అందరికీ తెలుసు డై తీసేస్తా తెల్ల గడ్డం కనిపిస్తుందని తెలుసు. అది హీరో అయినా క్యారెక్టర్ అయినా నాన్ను నాలాగే చూపిస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎవ్వరొచ్చినా ముందు అదే చెప్తాను.