స్పైడర్ మూవీ... పాటలు బ్యాలెన్స్

Thursday,June 08,2017 - 11:31 by Z_CLU

మహేష్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎండ్వంచర్స్ మూవీ స్పైడర్. ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా ముస్తాబవుతోంది. మ్యాగ్జిమమ్ షూటింగ్ పూర్తిచేసుకున్న  సినిమాకు సంబంధించి ప్రస్తుతం సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్. ఈనెల 13 నుంచి సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.

చివరి షెడ్యూల్ లో భాగంగా 2 పాటల్ని పిక్చరైజ్ చేస్తారు. ఈ సాంగ్స్ కంప్లీట్ అయితే స్పైడర్ షూటింగ్ మొత్తం ఫినిషి అయినట్టు అవుతుంది. ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ కోసం మురుగదాస్ చాలా టైం తీసుకుంటున్నాడు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకూడదని నిర్ణయించుకున్నాడు. స్పైడర్ టీజర్ చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమౌతుంది.

అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి దసరా కానుకగా స్పైడర్ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓపెన్ అయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కోలీవుడ్ లో కూడా ఈ సినిమాకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.