రాజమౌళి మహేష్ బాబు కాంబో ఫిక్స్

Tuesday,September 26,2017 - 02:00 by Z_CLU

బాహుబలి 2 తరవాత రాజమౌళి నెక్స్ట్ సినిమాకి సంబంధించి ఇంకా అఫీషియల్ గా ఎటువంటి అప్ డేట్ బయటికి రాలేదు. ఇంతలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి రంగం సిద్ధమవుతుంది అనే న్యూస్ టాలీవుడ్ లో చిన్న వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అయితే ప్రస్తుతం స్పైడర్ మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్న మహేష్ బాబు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు.

రాజమౌళి డైరెక్షన్ లో తన సినిమా ఖచ్చితంగా ఉంటుంది అని కన్ఫమ్ చేసిన సూపర్ స్టార్, ప్రస్తుతానికి ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా టైమ్ పడుతుందని చెప్పాడు. అటు రాజమౌళి తో పాటు మహేష్ బాబు కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అయి ఉండటంతో, ఆ కమిట్ మెంట్స్ క్లియర్ అయిన తరవాతే ఈ ప్రాజెక్ట్ మీద ఆపని చేస్తాం అని క్లారిటీ ఇచ్చాడు మహేష్ బాబు.

రేపు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానున్న స్పైడర్ మూవీ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా మహేష్ బాబు, ఈ సినిమాలో ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా ఎంటర్ టైన్ చేయనున్నాడు. A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.