రొమేనియాలో స్పైడర్ సాంగ్ షూటింగ్

Tuesday,August 29,2017 - 02:22 by Z_CLU

మహేష్ బాబు స్పైడర్ సాంగ్ షూటింగ్ రొమేనియాలో జరుగుతుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్, మిగిలిన ఒక్క సాంగ్ షూటింగ్ ఫాస్ట్ పేజ్ లో కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. మరో మూడు  రోజుల్లో కంప్లీట్ సాంగ్ షూట్ చేసుకునే స్పీడ్ లో ఉంది. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఆల్ రెడీ ఫుల్ స్వింగ్ లో ఉంది.

ఇకపోతే ఇప్పటికే ‘బూమ్ బూమ్’ సాంగ్ తో మ్యాగ్జిమం అటెన్షన్ ని గ్రాబ్ చేసిన సినిమా యూనిట్, త్వరలో ‘పుచ్చ కాయ పుచ్చ కాయ’ అంటూ సాగే సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉంది. సెప్టెంబర్ 27 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా టాలీవుడ్ లోనే కాదు అటు కోలీవుడ్ లోను హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ లోను గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సినిమా యూనిట్ ఈ గ్రాండ్ ఎంట్రీకి తగ్గట్టుగా ప్రమోషన్స్ ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తుంది. మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.