'శివ' సినిమాను గుర్తుచేసిన తండ్రికొడుకులు

Tuesday,August 29,2017 - 03:17 by Z_CLU

ఈరోజు నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజుగారి గది-2 మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. సేమ్ టైం, తండ్రికి శుభాకాంక్షలు తెలుపుతూ.. యుద్ధం శరణం సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు నాగచైతన్య. ఈ రెండు స్టిల్స్ ను పక్కపక్కన చూసిన ప్రేక్షకులకు ఒకప్పటి శివ సినిమా గుర్తొచ్చింది.

యుద్ధం శరణం సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువ. పైగా ఈరోజు నాన్న పుట్టినరోజు కాబట్టి, శివ సినిమా గుర్తుకొచ్చేలా సైకిల్ చెయిన్ పెట్టి పోస్టర్ రిలీజ్ చేశాడు నాగచైతన్య. అయితే అటు రాజుగారి గది-2 మోషన్ పోస్టర్ కూడా శివ సినిమానే గుర్తుచేయడం విశేషం.

 

ఒకప్పటి శివ సినిమాలో నాగార్జున ఎలాగైతే చైన్ చూపించాడో.. యాజ్ ఇటీజ్ గా రాజుగారి గది-2లో కూడా నాగార్జున అదే పోజుతో కనిపించాడు. కాకపోతే చేతిలో సైకిల్ చైన్ బదులు రుద్రాక్షలు ఉన్నాయి. అదొక్కటే తేడా. అప్పటి నాగ్ కు, ఇప్పటి మన్మధుడికి ఏమాత్రం తేడా లేదు. వయసు పెరిగినా అదే అందం. నాగ్ నటిస్తున్న రాజుగాది గది-2ను అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నారు. ఇక నాగచైతన్య నటిస్తున్న యుద్ధం శరణం సినిమా వచ్చేనెల 8న థియేటర్లలోకి రానుంది.