రెండో సినిమాపై ఫోకస్ పెట్టిన రవితేజ

Monday,March 20,2017 - 07:01 by Z_CLU

ప్రస్తుతం టచ్ చేసి చూడు అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా సెట్స్ పై ఉంటుండగానే అప్పుడే మరో సినిమాపై ఫోకస్ పెట్టాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి 2 సినిమాలు స్టార్ట్ చేశాడు మాస్ రాజా. వీటిలో టచ్ చేసి చూడు ఒకటి కాగా… అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ అనే మరో మూవీ కూడా ఉంది. ఈ సినిమానే ఇప్పుడు సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు మాస్ రాజా ప్రయత్నిస్తున్నాడు.

 

దిల్ రాజు బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా షెడ్యూల్ ను డార్జిలింగ్ లో ప్లాన్ చేశారు. వచ్చేనెల మొదటి వారంలో ఈ ముూవీ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. కృష్ణగాడి వీరప్రేమగాథ ఫేం మెహ్రీన్ హీరోయిన్ గా ఎంపికైంది. దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది.

రాజా ది గ్రేట్ మూవీకి సంబంధించి ఇప్పటికే స్క్రీన్ ప్లే వర్క్ పూర్తిచేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ మూవీలో రవితేజ అంధుడిగా కనిపించనున్నాడట. సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి.