రేపటి నుండి రాజమౌళి ఫ్రీ

Tuesday,April 18,2017 - 02:40 by Z_CLU

బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ ఇవాళ్టికి కంప్లీట్ కానుంది. ఎడిటింగ్ దగ్గరి నుండి గ్రాఫిక్స్ వరకు కంప్లీట్ గా ప్యాకప్ చెప్పనుంది  సినిమా యూనిట్. దానికి తోడు సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుని U/A సర్టిఫికెట్ పొందిన బాహుబలి 2 ప్రింట్స్ ఈ వీకెండ్ కి డిస్ ప్యాచ్ కానున్నాయి.

ఐదేళ్ళు కంప్లీట్ గా బాహుబలి, మాహిష్మతి  సామ్రాజ్యం, అందులోని పవర్ ఫుల్ క్యారెక్టర్స్ మధ్య గడిపిన రాజమౌళి ఇక రేపటి నుండి కంప్లీట్ గా, రిలీఫ్ కాబోతున్నాడు. ఇక నో మోర్ యాక్షన్ జస్ట్ ప్రమోషన్ మోడ్ లోకి ట్రాన్స్ ఫాం కాబోతున్నాడు జక్కన్న.

 

ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో పబ్లిసిటీ జరుపుకుంటున్న సినిమా యూనిట్, ఇంకా జస్ట్ 10 డేస్ లో థియేటర్స్ లోకి రానున్న బాహుబలి 2 ఫీవర్ ని ఇంకా రేజ్ చేసే పనిలో ఉంది. ఇప్పటికే బాహుబలి 2 సోషల్ మీడియాలో మ్యాగ్జిమం స్పేస్ ని ఆక్యుపై చేసేసింది.