సింగం 3 రిలీజ్ డేట్

Thursday,December 22,2016 - 12:30 by Z_CLU

సూర్య సింగం 3 కి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. డిసెంబర్ 9 న రిలీజ్ అవాల్సిన ఈ సినిమా సడెన్ గా రిలీజ్ డేట్ దగ్గర పడేసరికి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పటి దాకా సింగం 3 రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించని సినిమా యూనిట్, చివరికి సినిమాకి ఫైనల్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది.

సూర్య పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 26 న రిలీజవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న ఈ సినిమాకి హరి దర్శకత్వం వహించాడు. అనుష్కతో పాటు శృతి హాసన్ కూడా హీరోయిన్ గా నటించింది.