దేవి నే ఫిక్స్ చేసిన యంగ్ టైగర్

Thursday,December 22,2016 - 03:03 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ను ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా విషయంలో  కథ నుంచి టెక్నీషియన్స్ వరకూ దగ్గరుండి డెసిషన్స్ తీసుకున్న తారక్,  బాబీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను జనవరిలో సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ని ఫిక్స్ చేసుకునే విషయంలోనూ తారక్ చాలా డిస్కషన్స్ జరిపాడు

నిన్న, మొన్నటి వరకు ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేసే చాన్సెస్ ఉన్నాయనిపించినా, తారక్ మాత్రం చివరికి D.S.P. నే ప్రిఫర్ చేశాడు. అఫ్ కోర్స్ వై దిస్ కొలవరి డీ సాంగ్ తో, పాప్యులర్ అయిన అనిరుద్ తమిళనాట బిజీ మ్యూజిక్ కంపోజర్ గా దూసుకుపోతున్నాడు. అయినా సడెన్ గా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అంటే రిస్కే అని ఫీలయినట్టున్నాడు తారక్.