దూసుకొస్తున్న సింగం..

Wednesday,October 26,2016 - 05:38 by Z_CLU

సూర్య కెరీర్ లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ వెంచర్ సింగం. ఈ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలూ హిట్టయ్యాయి. అందుకే ఇప్పుడు సింగం-3ని సిద్ధం చేస్తున్నారు. ఈసారి ఇంకాస్త ఎక్కువ మసాలాలు దట్టించి, మరింత భారీతనంతో సింగం-3 సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశారు. ఇటీవలే జరిగిన భారీ షెడ్యూల్ లో టాకీ పార్ట్ పూర్తయింది. హరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన అనుష్క, శృతి హాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

       ఇక ‘సింగం’, ‘సింగం-2’ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న సూర్య సింగం-3 తో మరో సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు…  ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు భాషలతో పాటు హిందీ లో కూడా విడుదల చెయ్యబోతున్నారు. మల్కాపురం శివకుమార్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. దీపావళికి టీజర్ విడుదల చేసి… డిసెంబర్ 16 న ప్రపంచవ్యాప్తంగా సింగం-3ను విడుదల చేయనున్నారు.