న్యూ ఇయర్ కోసం మంచు విష్ణు రెడీ

Thursday,December 22,2016 - 11:35 by Z_CLU

ఈ ఇయర్ ను గ్రాండ్ గా ముగించిన మంచు విష్ణు… కొత్త ఏడాది కోసం అప్పుడే ప్రిపేర్ అయిపోయాడు. లక్కున్నోడు సినిమాతో న్యూ ఇయర్ ను బిగిన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసిన విష్ణు.. లక్కున్నోడు మూవీని ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించాడు.

`ఈడోరకం-ఆడోరకం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా, బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రమే ఈ లక్కున్నోడు. గతంలో గీతాంజ‌లి, త్రిపుర వంటి ఎంట‌ర్‌టైన‌ర్స్‌ తీసిన రాజ్ కిర‌ణ్ ఈ మూవీకి దర్శకుడు. విష్ణు-హన్సిక కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో వీళ్లిద్దరూ కలిసి దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాల్లో నటించారు. జనవరిలో ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. అచ్చు ఈ సినిమాకు సంగీత దర్శకుడు.