సింగం 3 రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,November 14,2016 - 10:15 by Z_CLU

సూర్య సింగం 3 రిలీజ్ డేట్ ఫిక్సయింది. రీసెంట్ గా రిలీజైన టీజర్ కేవలం రెండు రోజుల్లో 5 మిలియన్ వ్యూస్ తో రికార్డు సాధించింది. కబాలి తరవాత ఇంతలా క్రేజ్ సంపాదించుకున్న టీజర్ ఇదే. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సింగం 3’ ని తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 16 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సినిమా యూనిట్.

నీతి, నిజాయితీలే ఊపిరిగా భావించే ఒక పోలీసాఫీసర్ తనకు ఎదురైన సవాళ్ళను ఎలా ఎదుర్కున్నాడనే కథాంశంతో తెరకెక్కిందే సింగం 3.అఫ్ కోర్స్ సింగం గత సీక్వెల్స్ లో కూడా ఆ అంశాలే హైలెట్. కాకపోతే ఈ సీక్వెల్ ని ఇంకాస్త ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా తెరకెక్కించారని టీజర్ చూస్తుంటేనే తెలుస్తుంది. సింగం 2 లో హన్సిక సెకండ్ హిరోయిన్ గా స్పెషల్ క్యారెక్టర్ లో చేసింది. ఈ సీక్వెల్ లో శృతి హాసన్ ఎలాంటి పాత్రలో కనబడనుంది. కథ ఏ ఆంగిల్ లో మూవ్ అవుతుంది అనే అంశాలు ఇప్పటికే టాలీవుడ్ లో  క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి.