ఇక మిగిలింది యముడు-3 మాత్రమే...

Tuesday,January 17,2017 - 10:17 by Z_CLU

జనవరిలో బడా సినిమాల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి కానుకగా ఖైదీ నంబర్-150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానంభవతి లాాంటి పెద్ద సినిమాలు ఇప్పటికే థియేటర్లలోకి రాగా… ఇప్పుడు మరో సినిమా కూడాా లిస్ట్ లోకి చేరింది. సూర్య హీరోగా నటించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ వెంచర్ సింగం-3 థియేటర్లలోకి రావడానికి రెడీ అయింది. తెలుగులో దీన్ని యముడు-3 పేరుతో మల్కాపురం శివకుమార్ తెరకెక్కిస్తున్నారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న యముడు-3 థియేటర్లలోకి రాానుంది.

ఇప్పటికే హిట్ అయిన యముడు, యముడు-2 సినిమాలకు కొనసాగింపుగా ఇప్పుడు యముడు-3 తెరకెక్కింది. ఇందులో కూడా అనుష్కనే హీరోయిన్ గా తీసుకున్నారు. మరో కీలకమైన పాత్ర కోసం శృతిహాసన్ ను సెలక్ట్ చేశారు. డైరక్టర్ హరి ఈ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.