నిహారిక పెళ్లి కూడా సింపుల్ గానే

Friday,July 03,2020 - 11:02 by Z_CLU

సెలబ్రిటీల పెళ్లిళ్లంటే అదిరిపోతాయి. జనాలంతా కొన్ని రోజుల పాటు చెప్పుకునేలా లావిష్ గా జరుగుతాయి. కానీ కరోనాతో స్టార్స్ అంతా ఫామ్ హౌజుల్లో సింపుల్ గా పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. నిహారిక పెళ్లి కూడా అలానే జరగబోతోంది.

రీసెంట్ గా తన కాబోయే భర్తను పరిచయం చేసింది నిహారిక. అతడి పేరు చైతన్య జొన్నలగడ్డ. వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ త్వరలోనే జరగబోతోంది. అయితే అది చాలా సింపుల్ గా ఉంటుందని నాగబాబు ప్రకటించారు.

కేవలం నిశ్చితార్థం మాత్రమే కాదు, పెళ్లి కూడా అంతే సింపుల్ గా జరుగుతుంది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని క్లారిటీ ఇచ్చారు నాగబాబు. పెళ్లి గ్రాండ్ గా చేసుకుందామనుకున్న నిహారిక ఆశలకు కరోనా ఇలా గండికొట్టింది.

ఇప్పటికే నిఖిల్ సింపుల్ గా పెళ్లి తంతు పూర్తిచేశాడు. ఈ నెల 26న నితిన్ కూడా అంతే సింపుల్ గా ఫామ్ హౌజ్ లో పెళ్లి చేసుకోబోతున్నాడు. వచ్చేనెల 8న రానా కూడా అతికొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు నిహారిక పెళ్లి కూడా ఫామ్ హౌజ్ లోనే అంతే సింపుల్ గా జరగబోతోంది.