నిహారికకు కాబోయే భర్త ఇతడే

Friday,June 19,2020 - 09:47 by Z_CLU

తనకు కాబోయే భర్తను చూపించకుండా సస్పెన్స్ మెయింటైన్ చేసిన నిహారిక ఎట్టకేలకు అతడి ఫొటోను బయటపెట్టింది. ఇతడే నిహారిక కాబోయే భర్త. పేరు చైతన్య. పూర్తిపేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. మెగాకాంపౌండ్ కొత్త అల్లుడు.

గుంటూరుకు చెందిన ఓ పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇతడు. ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేదు. బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. ప్రస్తుతం ఓ పెద్ద MNC కంపెనీలో ఎగ్జిక్యూటివ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాడు.

నిహారిక-చైతన్య వెడ్డింగ్ డీటెయిల్స్ ను మరికాసేపట్లో నాగబాబు వెల్లడించబోతున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఆగస్ట్ లో నిహారిక-చైతన్య ఎంగేజ్ మెంట్ ఉండొచ్చు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది పెళ్లి చేసే ప్లాన్ లో ఉన్నారు.

 

మొత్తమ్మీద ఈ ఫొటోలతో నిహారిక వెడ్డింగ్ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది.