Niharika Engagement: మెగా ఫంక్షన్

Thursday,August 13,2020 - 09:40 by Z_CLU

మెగా డాటర్ నిహారిక మ్యారేజ్ ప్రాసెస్ లో మరో అడుగు. ఈరోజు మెగా డాటర్ నిశ్చితార్థం పూర్తయింది. హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది ఈ ఎంగేజ్ మెంట్.

గుంటూరు బడా ఫ్యామిలీకి చెందిన చైతన్య జొన్నలగడ్డతో Niharika Engagement జరిగింది. కాబోయే భార్యాభర్తలిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.

ఈ పెళ్లికి చైతన్య కుటుంబ సభ్యులతో పాటు Mega Heroes అందరూ హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయితేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. ఇలా హీరోలంతా దిగిన గ్రూప్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Niharika Marriage డిసెంబర్ లో జరుగుతుంది.