బయటకొచ్చిన బన్నీ.. పార్క్ లో జాగింగ్

Friday,July 03,2020 - 10:02 by Z_CLU

స్టార్స్ అందరికీ ఇళ్లలోనే జిమ్స్ ఉంటాయి. వర్కవుట్స్ అయినా ఏదైనా అన్నీ అందులోనే. కానీ బన్నీ మాత్రం బయటకొచ్చాడు. కేబీఆర్ పార్క్ లో జాగింగ్ చేశాడు. కొన్ని రోజులుగా బన్నీ ఈ పార్క్ కు వస్తున్నాడు.

భార్య స్నేహ కూడా బన్నీతో జాయిన్ అయింది. ఇద్దరూ కలిసి కేబీఆర్ పార్క్ లో జాగింగ్ చేశారు. కొన్ని రోజులుగా బన్నీ ఈ పార్క్ లో జాగింగ్ చేస్తున్నాడు. పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్ ను పెట్టుకొని మరీ ఇలా ఔట్ డోర్ కు వచ్చాడు.

అయితే లాక్ డౌన్ రూల్స్ సడలించడంతో ఇప్పుడిప్పుడే హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరుగుతోంది. సో.. బన్నీ ఇంకా ఎన్ని రోజులు ఇలా పార్క్ కు వచ్చి జాగింగ్ చేస్తాడో చూడాలి.

అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్, ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ కోసం వెయిటింగ్. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షెడ్యూల్ లేట్ అవుతోంది. ప్రస్తుతం సెట్ వర్క్ నడుస్తోంది. త్వరలోనే ఆ సెట్ లో షూట్ మొదలవుతుంది.