పుష్ప ఐటెంసాంగ్.. ఈమే ఆ లక్కీ గర్ల్

Friday,July 03,2020 - 12:03 by Z_CLU

సుకుమార్ సినిమాల్లో ఐటెంసాంగ్స్ కు చాలా క్రేజ్ ఉంటుంది. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అవుతుందో, అందులో నటించిన హీరోయిన్ కు కూడా అంతే క్రేజ్ వస్తుంది. అందుకే సుక్కూ సినిమాలో ఐటెంసాంగ్ చేయడానికి హీరోయిన్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈసారి ఆ ఛాన్స్ పాయల్ రాజ్ పుత్ కొట్టేసింది.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే పుష్ప సినిమాలో ఐటెంసాంగ్ చేసే అవకాశం పాయల్ ను వరించే ఛాన్స్ ఉంది. ఈ మేరకు డిస్కషన్స్ పూర్తయినట్టు టాక్. ఈ సినిమాలో ఐటెంసాంగ్ కు సంబంధించి దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ఓ అదిరిపోయే ట్యూన్ రెడీ చేసిన సంగతి తెలిసిందే.

నిజానికి పుష్ప ఐటెంసాంగ్ కోసం బాలీవుడ్ భామల్ని ట్రై చేశాడు సుకుమార్. తెలుగులో కూడా కొంతమంది స్టార్ హీరోయిన్లను అనుకున్నాడు. కానీ ఫైనల్ గా పాయల్ ను ఫిక్స్ చేశాడంటే దాని
వెనక ఏదో లాజిక్/రీజన్ ఉండే ఉంటుంది.

ఇంతకుముందు సుకుమార్ చేసిన రంగస్థలం సినిమాలో ఐటెంసాంగ్ ను పూజా హెగ్డే చేసింది. ఈసారి కూడా అలాంటి క్రేజీ హీరోయిన్ నే తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆఖరి నిమిషంలో పాయల్ ను సెలక్ట్ చేశారట. పాయల్ కు సీత సినిమాలో ఐటెంసాంగ్ చేసిన అనుభవం ఉంది.