అట్టహాసంగా నిహారిక పెళ్లి

Thursday,December 10,2020 - 07:31 by Z_CLU

మెగా డాటర్ నిహారిక కొణెదల పెళ్లి అట్టహాసంగా జరిగింది. ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ రిసార్ట్ తో నిన్న సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు నిహారిక కొణెదల-చైతన్య జొన్నలగడ్డ వివాహం జరిగింది.

Niharika_Konidela_wedding_chiranjeevi_allu_arjun-zeecinemalu

పెళ్లికి 3 రోజుల ముందు నుంచి వేడుకలు జరిగాయి. మెహందీ ఫంక్షన్, సంగీత్, హల్దీ ఫంక్షన్, పెళ్లికూతురు ముస్తాబు.. ఇలా వరుస వేడుకలతో మెగా కుటుంబ సభ్యులంతా పెళ్లిలో ఎంజాయ్ చేశారు.

Niharika_Konidela_wedding_Pawan_kalyan_nagababu-zeecinemalu

మెగా కాంపౌండ్ నుంచి ఏ ఒక్కరూ ఈ పెళ్లిని మిస్ అవ్వలేదు. చివరికి ఫంక్షన్లకు దూరంగా ఉండే పవన్ కల్యాణ్ కూడా కొడుకు అకిరాతో కలిసి నిహారిక పెళ్లికి హాజరయ్యారు. వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూర్తిగా తెలుగు సంప్రదాయంలో ఈ పెళ్లి జరిగింది.

Niharika_wedding_mega_heroes-zeecinemalu

పెళ్లికి ఒక రోజు ముందే చిరంజీవి దంపతులు, నిహారికకు భారీ కానుక అందించారు. దాని ఖరీదు అటు ఇటుగా 2 కోట్ల రూపాయలు అంటుందట. ఇక మెగా హీరోలంతా ఇచ్చిన కానుకలతో కలిపి చూసుకుంటే.. నిహారికకు దాదాపు 5 కోట్ల రూపాయల గిఫ్టులు అందాయని టాక్.

త్వరలోనే హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటుచేసే ఆలోచనలో ఉంది మెగా ఫ్యామిలీ. ఆ తర్వాత నిహారిక-చైతన్య కలిసి హనీమూన్ కు వెళ్తారు.