మరోసారి వాయిదాపడిన సిద్దార్థ్ మూవీ

Wednesday,November 08,2017 - 01:24 by Z_CLU

లెక్కప్రకారం ఈపాటికి థియేటర్లలోకి రావాల్సింది గృహం సినిమా. తమిళ్ వెర్షన్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ పోన్ అయింది. అలా వాయిదాపడిన ఈ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా నవంబర్ 10న రాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. కానీ గృహం రిలీజ్ మరోసారి వాయిదాపడింది. ఈ సినిమాను వాయిదావేస్తున్నట్టు  మరోసారి ప్రకటించాడు హీరో సిద్దార్థ్. తమ సినిమాకు ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ రాలేదని, వీలైతే 17న సినిమాను విడుదల చేస్తామని ట్వీట్ చేశాడు.

కంప్లీట్ హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. తమిళ్ లో గత వారమే అవల్ పేరిట ఇది విడుదలైంది. అక్కడ దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అదే ఊపులో తెలుగు, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయాలని ప్రయత్నించారు. కానీ తెలుగు వెర్షన్ తో పాటు హిందీ వెర్షన్ కూడా వాయిదాపడింది.

 సిద్దార్థ్, ఆండ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన గృహం సినిమాకు మిలింద్ రావ్ దర్శకత్వం వహించారు. వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్స్‌ తో కలిసి సిద్దార్థ్ ఈ సినిమాను నిర్మించాడు.