మంచు మనోజ్ ఇంటర్వ్యూ

Wednesday,November 08,2017 - 02:38 by Z_CLU

మంచు మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’ ఈ నెల 10 న రిలీజవుతుంది. L.T.T.E లీడర్ ప్రభాకరన్ గా, ఇప్పటితరం యూత్ లీడర్ గా.. రెండు డిఫెరెంట్ షేడ్స్ లో నటించిన మంచు మనోజ్, ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా రాబోతున్న ఒక్కడు మిగిలాడు సినిమా గురించి మనోజ్ ఏమంటున్నాడో చూద్దాం.

చాలా పెద్ద బాధ్యత

‘ఒక్కడు మిగిలాడు’ జస్ట్ సినిమా కాదు.. బాధ్యత. ఒక వర్గం దేవుడిలా భావించే వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు, ఎంతో మంది తల్లుల కష్టాన్ని తెరకెక్కిస్తున్నప్పుడు చాలా  జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం. ఇప్పటివరకు ఎవరికీ తెలియని కథలు తెలుసుకున్నాం…  అందరం కలిసి కష్టపడ్డాం. సినిమాలో 95% అందరూ కొత్త వాళ్లే.

 

సినిమా 2017 లోనే బిగిన్ అవుతుంది

అజయ్ ఆండ్రూస్ సినిమాని సరిగ్గా డిజైన్ చేశారు… సినిమా ఫస్టాఫ్ లో ఒక ప్రాబ్లమ్ బిగిన్ అవుతుంది. తీరా మనం అలాంటి ప్రాబ్లం గతంలో ఎప్పుడైనా ఫేస్ చేశామా అంటే.. అప్పుడు సినిమా 1990 బ్యాక్ డ్రాప్ కి మూవ్ అవుతుంది. అలా ఫస్టాఫ్ లో టైట్ స్క్రీన్ ప్లే తో హై ఇంటెన్సివ్ వార్ సీక్వెన్సెస్ తో క్లోజ్ చేస్తే,  ఆ వార్ లో ఒక పాపతో పాటు మరో 11 మంది శరణార్థులు, మన దేశానికి రీచ్ అయ్యే ప్రాసెస్ లో, ఫుడ్ కూడా లేని పరిస్థితుల్లో సముద్రంలో ఇరుక్కుని ఏం చేశారు..? ఎలా బయటపడ్డారు అనేదే సినిమా సెకండాఫ్.

ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు

వార్ సీక్వెన్సెస్  బ్యాక్  డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ శరణార్థులపై ఇలాంటి సినిమాలు ఇప్పటి వరకు రాలేదు.

బిర్యానీ కాదు.. గంజి కూడు

మామూలుగా మన సినిమాల్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కామెడీ, రొమాన్స్, యాక్షన్స్ అన్ని కలగలిపి మంచి  బిర్యానీలా ఉంటాయి మన సినిమాలు. కానీ ఈ సినిమా అలా కాదు… కామెడీ ఉండదు, రొమాన్స్ ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా సలాడ్ కూడా కాదు. గంజి కూడు.. రియలిస్టిక్ స్టోరీ.

అందుకే అలా చెప్పాను.

ఈ సినిమా నన్నెంతలా కదిలించిందంటే ఈ సినిమా తరవాత నేను కూడా అలాగే సొసైటీకి ఏదో చేయాలనిపించింది. నిజానికి అదే లైఫ్ అనేంతలా  ఇన్ స్పైర్ చేసింది. అందుకే ఆ  ఇమోషన్ లో సినిమాలు చేయనని చెప్పాను.

చాలా గాయాలయ్యాయి.

ఈ సినిమా కోసం బరువు పెరగడం, తగ్గడం లాంటి ప్రాసెస్ లో మ్యాగ్జిమం హెల్త్ పాడయిపోయింది. ఇంకో 6 నెలలు బ్రేక్ తీసుకుంటే గాని నార్మల్  స్టేజ్ కి రాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్

లవ్ స్టోరీ చేస్తా… ఇప్పటికే అజయ్ శాస్త్రి, శరవన్ కలిసి ఓ స్టోరీ చెప్పారు. ఈ సినిమాకి చంద్ర డైరెక్టర్. కాకపోతే ఏ సినిమా ఆయినా 6 నెలల గ్యాప్ తర్వాతే. బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలు ఒకేసారి కంప్లీట్ చేస్తా.