అనుష్క రేంజ్ కి తగ్గ సినిమా ‘భాగమతి’

Wednesday,November 08,2017 - 12:28 by Z_CLU

రీసెంట్ గా అనుష్క బర్త్ డే సందర్భంగా ‘భాగమతి’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. నెవర్ సీన్ బిఫోర్ రేంజ్ లో డిఫెరెంట్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ ఆడియెన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేయడమే కాదు, నిన్నా మొన్నటి వరకు ఈ మూవీ హిస్టారికల్ ఎంటర్ టైనర్ అయి ఉంటుందనే ఒపీనియన్  కూడా బ్రేక్ చేసింది.

ప్రస్తుతం భాగమతి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దాదాపు ఐదేళ్ళుగా ఈ సినిమా కోసం అనుష్కతో  ట్రావెల్ చేసిన డైరెక్టర్ అశోక్ ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. బాహుబాలి లాంటి బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ తరవాత అనుష్క ఇమేజ్ కి, రేంజ్ కి తగ్గ సినిమా అనిపించుకుంటుంది  అని  చెప్పుకున్న అశోక్ ఈ సినిమాలో  అనుష్కది   డ్యూయల్  రోల్  కాదు అని క్లారిటీ  ఇచ్చాడు.

త్వరలో ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, డిసెంబర్ సెకండాఫ్ లో లేదా జనవరి ఫస్టాఫ్ లో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీ రోల్ ప్లే చేస్తున్నాడు.