సిద్ధార్థ్ ఇంటర్వ్యూ

Wednesday,November 15,2017 - 05:09 by Z_CLU

సిద్ధార్థ్ ‘గృహం’ నవంబర్ 17 న రిలీజవుతుంది. తమిళంలో ఇప్పటికే సూపర్ హిట్టయిన ఈ సినిమా టాలీవుడ్ లోను అంతే సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు హీరో సిద్ధార్థ్.

గృహం సినిమా…

ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్… ఈ సినిమా చూస్తున్నంత  సేపు ఎంతగా భయపడతామో, సినిమా చూసి బయటికి వచ్చినప్పుడు కూడా అంతే రియలిస్టిక్  ఫీలింగ్ ఉంటుంది.

 

హారర్ మైండ్ లో ఉండిపోతుంది…

ఒక రియల్ స్టోరీకి ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన సినిమా గృహం. సినిమాలో క్లైమాక్స్ హైలెట్ అవుతుంది. సినిమా చూశాక కొన్ని రోజుల వరకు హారర్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది.

హాలీవుడ్ సినిమా అనిపించడానికి రీజన్ అదే…

సినిమా కలర్ విషయంలో చాలా డెసిషన్స్ తీసుకున్నాం. హారర్ సినిమా అనగానే చాలా సినిమాలు చీకట్లో ఉంటాయి. అలా  ఉండకూడని ముందే ఫిక్సయ్యాం. సినిమాలో ఉండే ఇల్లు కూడా వుడ్ హౌజ్ కావడం చేత గ్రీన్ కలర్ ప్రిఫర్ చేశాం. అందుకే సినిమాకి హాలీవుడ్ మూవీ ఎఫెక్ట్ వచ్చింది.

థియేటర్ లోంచి పారివడం గ్యారంటీ…

కొత్తగా భయపెట్టాలనుకున్నాం… ఇప్పటి వరకు ఏ హారర్ సినిమాలోను చూడని విధంగా సీన్స్ ప్లాన్  చేసుకున్నాం. సినిమా మొత్తంలో ఒక సీన్ మాత్రం వణికించేస్తుంది. ఆ సీన్ కి భయంతో థియేటర్ లోంచి బయటికి పారిపోవడం గ్యారంటీ.. అంత స్కేరీగా ఉంటుంది.

దయచేసి ఫ్యామిలీతో చూడకండి…

గృహం మూవీ 100% హారర్ మూవీ.. దయచేసి చిన్న పిల్లలు,  హార్ట్ పేషెంట్స్ సినిమా చూడకండి… ఇది మెచ్యూర్డ్ ఆడియెన్స్ కోసం తీసిన సినిమా…

 

సక్సెస్ అయితే ట్రెండ్ క్రియేట్ అయినట్టే…

ఇండస్ట్రీలో చాలా  రోజుల తరవాత మరే ఎలిమెంట్ లేకుండా జస్ట్ హారర్ బేస్డ్ ఎలిమెంట్స్  తో  చేసిన  సినిమా   గృహం. ప్రస్తుతం హారర్ సినిమాలో ‘దెయ్యం’ అంటే పక్కా కామెడీ ఎలిమెంట్.  ఈ సినిమాలో దెయ్యానికి రియల్ ఒరిజినాలిటీ కనిపిస్తుంది.   ఇది గనక సక్సెస్ అయితే డెఫ్ఫినెట్ గా ట్రెండ్  అవుతుంది. గృహం ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా.

 

అనీషా విక్టర్ గురించి…

ఈ సినిమాలో అనీషా విక్టర్ గురించి స్పెషల్ గా చెప్పాలి. తన పర్ఫామెన్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమాలో పెద్ద  డైలాగ్స్ ఉండవు, మ్యాగ్జిమం బాడీ లాంగ్వేజ్ తోనే ఎవ్రీ  ఇమోషన్ కన్వే అవుతూంటుంది.

అందుకే ఈ సినిమాను నిర్మించా…

అవుట్ స్టాండింగ్ టెక్నీషియన్స్ తో పాటు మంచి స్క్రిప్ట్ దొరికింది. ఇంట్లో వాళ్ళు కూడా నేను డిఫెరెంట్ సినిమాల గురించి మాట్లాడినప్పుడు నువ్వే చేయవచ్చు  కదా అంటుంటారు అందుకే నేనే ప్రొడ్యూస్ చేశా. చాలా హ్యాప్పీగా ఉంది.