రవితేజ చేతుల మీదుగా ఇంద్రసేన వీడియో సింగిల్

Wednesday,November 15,2017 - 01:32 by Z_CLU

నవంబర్ 30 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది విజయ్ ఆంటోని ఇంద్రసేన. డిఫెరెంట్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా మారిన విజయ్ ఆంటోని ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేశాడు. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచిన ఈ సినిమా యూనిట్, రేపు గ్రాండ్ గా ఆడియో రిలీజ్ జరుపుకోనుంది. అయితే ఈ ఈవెంట్ లో మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాలోని వీడియో సింగిల్ ని రిలీజ్ చేయనున్నాడు.

G. శ్రీనివాసన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో డయానా చంపిక, మహిమ, జ్యువెల్ మేరీ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోని మ్యూజిక్ కంపోజ్ చేశాడు.