ఫస్ట్ లుక్ తో సందడి చేస్తున్న సిద్దార్థ్

Wednesday,October 04,2017 - 12:32 by Z_CLU

అప్పట్లో వరుస సినిమాలతో తెలుగులో సందడి చేసిన సిద్దార్థ్ ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ హీరోగా మారిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సందడి చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఇక కాలంలో థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తెలుగులో గృహం అనే టైటిల్ ను ఫిక్స్ చేసి సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

తమిళ్ లో ‘అవళ్’ అనే టైటిల్ తో హిందీలో ‘ది హౌస్ నెక్స్ట్ డోర్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు మిలింద్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. సిద్దార్థ్ సరసన ఆండ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా Viacom 18 మోషన్ పిక్చర్స్ & Etaki ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంది యూనిట్.