సంఘమిత్ర నుండి తప్పుకున్న శృతి హాసన్

Monday,May 29,2017 - 05:15 by Z_CLU

కారణాలు పెద్దగా బయటికి రాలేదు కానీ జయం రవి, ఆర్య, శృతి హాసన్ లీడ్ రోల్స్ లో రేపో మాపో సెట్స్ పైకి రానున్న ‘సంఘ మిత్ర’ నుండి శృతి హాసన్ తప్పుకుందన్న న్యూస్, సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమా కోసం మొన్నటి వరకు లండన్ లో స్వార్డ్ ఫైట్ స్పెషల్ ట్రేనింగ్ తీసుకున్న శృతి హాసన్, రీసెంట్ గా జరిగిన కేన్స్ ఫెస్టివల్ లో జరిగిన ‘సంఘమిత్ర’ లాంచ్ ఈవెంట్ లోను చాలా ఆక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. అలాంటిది ఇక సంఘమిత్ర లో ‘శృతి హాసన్’ నటించడం లేదు అనే అఫీషియల్ అప్ డేట్ రిలీజ్ చేశారు ఫిలిం మేకర్స్.

మరోవైపు బాలీవుడ్ సినిమా ‘బెహెన్ హోగీ తేరీ’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శృతి హాసన్, ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి, ప్రాపర్ స్క్రిప్ట్ కానీ, డేట్స్ కన్ఫర్మేషన్ కానీ లేకపోవడంతో చివరికి ఈ వెంచర్ నుండి తప్పుకోవాల్సి వచ్చినట్టు తెలుస్తుంది. సుందర్ C.  డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది.  ఈ సినిమాకి A.R. రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్న విషయం తెలిసిందే.