సాహో అంటున్న శ్రద్ధాకపూర్

Thursday,August 17,2017 - 02:03 by Z_CLU

నిన్నా మొన్నటి వరకు సాహో సినిమాలో ప్రభాస్ సరసన చాన్స్ కొట్టేసే ఆ లక్కీ హీరోయిన్ ఎవరై ఉంటారా..? అని రకరకాల స్పెక్యులేషన్స్ చక్కర్లు కొట్టాయి. శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా ఫిక్సయ్యిందనగానే ఆ స్పెక్యులేషన్ కి బ్రేక్ పడి, ఇపుడీ కాంబినేషన్ స్క్రీన్ పై ఎలా ఉండబోతుందనే ఎగ్జైట్ మెంట్ బిగిన్ అయిపోయింది. అయితే ఈ ఎగ్జైట్ మెంట్ జస్ట్ ఫ్యాన్స్ లోనే కాదు, శ్రద్ధాకపూర్ లోను బిగిన్ అయింది.

బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో చాన్స్ రావడంతో ఆనందం పట్టలేకుండా ఉంది శ్రద్ధా కపూర్. ఆ విషయాన్ని ట్వీట్ చేసి మరీ తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.

https://twitter.com/ShraddhaKapoor/status/898042315096416256

హై ఎండ్ టెక్నికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోయే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు  నీల్ నితిన్ ముకేష్ విలన్ గా నటించనున్నాడు. ఈ సినిమాకి సుజిత్ డైరెక్టర్. ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులకు ప్యాకప్ చెప్పే ప్రాసెస్ లో ఉన్న ‘సాహో’ టీమ్, రైట్ టైమ్ చూసుకుని సెట్స్ పైకి వచ్చే ఆలోచనలో ఉంది.