మెగాస్టార్ సినిమాలో లెజెండ్రీ బాలీవుడ్ స్టార్

Thursday,August 17,2017 - 01:19 by Z_CLU

మెగాస్టార్ 151 ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి నిన్న గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్రీ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారని అఫీషియల్ గా కన్ఫం చేసింది సినిమా  యూనిట్.

 

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరు ఫ్రీడమ్ ఫైటర్ లా నటిస్తుండగా, బిగ్ బి, ఓ కీ రోల్ ప్లే చేయనున్నాడు. మెగా స్టార్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోని ఈ నెల 22 న రిలీజ్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇప్పటికే మ్యాగ్జిమం ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన సినిమా యూనిట్, త్వరలో రెగ్యులర్ షూటింగ్ బిగిన్ చేసే ప్రాసెస్ లో ఉంది.

సినిమా సెట్స్ పైకి రాకముందు నుండే ఫ్యాన్స్ లో హై ఎండ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. తక్కిన టెక్నీషియన్స్ తో పాటు ఇతరత్రా వివరాలను 22 న అఫీషియల్ గా రివీల్ చేయనుంది సినిమా యూనిట్.