ప్రభాస్ సాహో - ఫస్ట్ టైమ్ అనుభవాలు

Saturday,July 20,2019 - 12:09 by Z_CLU

ప్రభాస్ స్టైలిష్ అవతార్ ఫ్యాన్స్ కి కొత్తేం కాదు… కానీ ‘సాహో’ ఎంతైనా వేరు… ఎందుకంటే ఈ సినిమాలోని ప్రతి కాంబినేషన్ ప్రభాస్ కొత్తే… అది క్రియేట్ చేయబోయే ఇంపాక్ట్  ఫ్యాన్స్ కి కూడా కొత్తే… ఈ సినిమాలో ప్రభాస్ కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఎక్స్ పీరియన్స్ చేసిన ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి…

సుజిత్ : ఈ డైరెక్టర్ తో మునుపెన్నడూ పని చేయలేదు ప్రభాస్… కాబట్టి సుజిత్ కూడా ప్రభాస్ ని ఒక పర్టికులర్ డైమెన్షన్ లో చూపించాలన్న డ్రీమ్ ని ఈ సినిమాతో నిజం చేసుకున్నాడు.

మ్యూజిక్ కంపోజర్స్ : తనిష్క్ బాగ్చి, జిబ్రాన్ సంయుక్తంగా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు ఈ సినిమాకి. వీళ్ళతో కూడా ప్రభాస్ గతంలో ఎప్పుడూ పని చేయలేదు. ఫస్ట్ టైమ్…

శ్రద్ధా కపూర్ : ఈ సినిమాతోనే టాలీవుడ్ లో లాంచ్ అవుతుంది శ్రద్ధా కపూర్. ప్రభాస్ ఈ హీరోయిన్ తో జోడీ కట్టడం కూడా ఇదే ఫస్ట్ టైమ్.

హాలీవుడ్ కొరియోగ్రాఫర్ : ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయి. వీటిని హాలీవుడ్  యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీబేట్స్ కంపోజ్ చేశాడు. ప్రభాస్ కరియర్ లో టాప్ మోస్ట్ ఫైట్ మాస్టర్స్ తో పని చేశాడు కానీ  కేన్నీ బేట్స్ తో పని చేయడం మాత్రం ఫస్ట్ టైమ్.

ఆగష్టు రిలీజ్ : సాహో ఆగష్టు 30 న రిలీజవుతుంది. ఇది కూడా ప్రభాస్ కరియర్ లో ఫస్ట్ టైమ్ ఎలిమెంటే… ఇప్పటి ప్రభాస్ ఒక్క సినిమా కూడా ఆగష్టులో రిలీజ్ కాలేదు.