స్టుడియో రౌండప్

Sunday,September 01,2019 - 01:17 by Z_CLU

ప్రతి రోజూ పండగే
సాయి తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రతి రోజూ పండగే’ షూటింగ్ ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది. మరో వారం పాటు హౌజ్ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. ఆ తర్వాత రాజమండ్రి లో ఒక షెడ్యూల్ ఉంటుంది.

ఎంత మంచి వాడవురా
కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ‘ఎంత మంచి వాడవురా’ షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతంలో జరుగుతుంది. ఇటీవలే నటశా దోషి పై ఓ ఐటమ్ సాంగ్ షూట్ చేసిన మేకర్స్ ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మూవీస్ పై ఉమేష్ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీసుందర్ మ్యూజిక్ కంపోజర్.

బాలయ్య కొత్త సినిమా
కేఎస్. రవిమార్ డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న సినిమాకు సంబంధించి థాయ్ లాండ్ లో మొదటి షెడ్యూల్ పూర్తయింది. 5వ తేదీ నుంచి హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్స్ లో కనిపించబోతున్నాడు. సి.కళ్యాణ్ నిర్మాత. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

చాణక్య
గోపీచంద్ ‘చాణక్య’ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం యూనిట్ ఇటలీలోని మిలాన్ లో సాంగ్స్ షూట్ చేస్తున్నారు. మిలాన్ లో రాజు సుందరం కొరియోగ్రఫీలో 3 సాంగ్స్ షూట్ చేస్తారు. ఏకే ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాతో తిరు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అక్టోబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు
మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. కర్నూల్ కొండారెడ్డి బురుజు సెట్ లో మహేష్ బాబు పై కొన్ని సీన్స్ తీస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర నిర్మాత. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ శాంతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు.

అల వైకుంఠపురంలో
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది అలవైకుంఠపురం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అన్నపూర్ణ స్టుడియోస్ లో షెడ్యూల్ నడుస్తోంది. బన్నీ, టబు కాంబినేషన్ లో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం ఖరీదైన ఇంటి సెట్ నిర్మించారు.