సాహో 2 రోజుల కలెక్షన్

Sunday,September 01,2019 - 12:48 by Z_CLU

ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ సాహో రెండో రోజు కూడా రికార్డు వసూళ్లు సాధించింది. మొదటి రోజుకే వరల్డ్ వైడ్ వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా, రెండో రోజుకు ఆ కౌంట్ ను ఇంకాస్త పెంచుకుంది. మరీ ముఖ్యంగా నార్త్ లో తన పట్టు నిలబెట్టుకుంది సాహో. విడుదలైన ఈ 2 రోజుల్లో నార్త్ లో 50 కోట్ల నెట్ సాధించింది.

అటు ఓవర్సీస్ లో కూడా దూసుకుపోతోంది సాహో. మొదటి రోజు ప్రీమియర్స్ తో 9 లక్షల 15వేల డాలర్లు ఆర్జించిన ఈ సినిమా.. రెండో రోజు వసూళ్లతో కలుపుకొని 2 మిలియన్ మార్క్ కు దగ్గరైంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాహో హవా కొనసాగుతోంది. నిన్నటితో 2 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ఏపీ, నైజాం కలుపుకొని 46 కోట్ల 26 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది.

ఏపీ,నైజాం 2 రోజుల షేర్
నైజాం – రూ. 14.62 కోట్లు
సీడెడ్ – రూ. 6.05 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.21 కోట్లు
ఈస్ట్ – రూ. 4.98 కోట్లు
వెస్ట్ – రూ. .3.95 కోట్లు
గుంటూరు – రూ. 5.43 కోట్లు
నెల్లూరు – రూ. 2.89 కోట్లు
కృష్ణా – రూ. 3.13 కోట్లు