కలకత్తా నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన శర్వానంద్

Friday,May 11,2018 - 06:01 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది శర్వానంద్ పడి పడి లేచే మనసు. రీసెంట్ గా కలకత్తాలో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, ఈ రోజు నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ బిగిన్ చేశారు. ఈ షెడ్యూల్ లో సాయి పల్లవి, శర్వానంద్ కాంబినేషన్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

‘క్రిష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘లై’ లాంటి డిఫెరెంట్ ఎంటర్టైనర్స్ తరవాత హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బిగినింగ్ నుండే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ లో సాయి పల్లవి బెగాలీ అమ్మాయిలా కనిపించనుందని తెలుస్తుంది.

 

మోస్ట్ ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ ని హను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడా అనే క్యూరియాసిటీ అప్పుడే ఫ్యాన్స్ లో జెనెరేట్ అవుతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.