శర్వానంద్ ఇకనుండి నేపాల్ లో...

Friday,July 13,2018 - 05:35 by Z_CLU

ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘పడిపడి లేచే మనసు’ సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. అయితే ఈ సినిమా కలకత్తాలో 70 రోజుల భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్, నెక్స్ట్ షెడ్యూల్ నేపాల్ లో జరుపుకోనుంది.

ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉన్న సినిమా యూనిట్ నేపాల్ షెడ్యూల్ ప్రిపరేషన్స్ లో ఉంది. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి బెంగాళీ అమ్మాయిలా మెస్మరైజ్ చేయనుంది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో బిగిన్ అయ్యే ఈ లవ్ స్టోరీలో క్రియేట్ అయ్యే కాంఫ్లిక్ట్ ఏంటి..? హను రాఘవపూడి ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ జెనెరేట్ చేయనున్నాడోనన్న క్యూరియాసిటీ ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది.

ఇప్పటికే నేపాల్ లోని ఎగ్జోటిక్ లొకేషన్స్ ని ఫిక్స్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, త్వరలో ఈ షెడ్యూల్ బిగిన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సినిమాపై అంచనాలను పెంచేసిన ఫిల్మ్ మేకర్స్ త్వరలో సినిమా టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.