బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ టీజర్ రిలీజ్

Monday,November 12,2018 - 03:51 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ టీజర్ రిలీజయింది. ‘సాక్ష్యం’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తరవాత వస్తున్న సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ లా కనిపించనున్నాడు.

‘అనగనగా ఒక రాజ్యం’ అంటూ బిగిన్ అయ్యే ఈ టీజర్, సినిమా థీమ్ ని ఎలివేట్ చేస్తుంది. ‘భయపెట్టే వాడికి, భయపడేవాడికి మధ్య ఒకడుంటాడురా వాడే పోలీస్..’ అనే డైలాగ్, యూత్ ని ఇంప్రెస్ చేస్తుంది. ఇకపోతే సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్, మెహరీన్ కౌర్ ఇద్దరిలో ‘రాణి‘ ఎవరా..? అనే క్యూరియాసిటీ ఆడియెన్స్  లో   రేజ్ చేస్తుందీ 1:10 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్.

యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతుంది ‘కవచం’. టైటిల్ తోనే మ్యాగ్జిమం పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. శ్రీనివాస్ మామిళ్ళ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈ సినిమా.

కాజల్ అగర్వాల్, మెహరీన్ కౌర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజర్. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.