శర్వ-మారుతి సినిమాకు డేట్ ఫిక్స్

Sunday,January 08,2017 - 12:00 by Z_CLU

శర్వానంద్ హీరోగా, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ మూవీకి అఫీషియల్ గా డేట్ ఫిక్స్ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరి 19న ఈ సినిమా గ్రాండ్ గా లాంఛ్ కాబోతోంది. గతంలో శర్వానంద్ హీరోగా రన్ రాజా రన్ అనే సూపర్ హిట్ సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైనే ఈ సినిమా రాబోతోంది. శర్వానంద్, మారుతి కాంబినేషన్ లో ఇదే తొలి చిత్రం కాబోతోంది.

ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో శతమానం భవతి సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత, కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మారుతి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్తాడు శర్వ. ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా కన్ ఫం చేయలేదు.