ప్రభాస్ చెప్పినా నమ్మలేదు -శర్వా

Wednesday,September 07,2022 - 03:46 by Z_CLU

బేసిక్ గా సినిమా రిజల్ట్ అనేది రిలీజ్ రోజే తెలిసిపోతుంది. టాక్ బట్టి సినిమా హిట్టా/ ఫట్టా అనేది ఈజీ గా చెప్పేయొచ్చు. కానీ యంగ్ హీరో శర్వా మాత్రం సోమవారం వరకూ హిట్ అయినా నమ్మనని అంటున్నాడు. అంతే కాదు తనకి మండే సిండ్రోం ఉందని నవ్వుతూ చెప్పుకున్నాడు. శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ సెప్టెంబర్ 9న రిలీజవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకు మాటలు అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తో శర్వా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా దిల్ సే అంటూ తన మనసులో ఉన్న కొన్ని విషయాలను బయట పెట్టాడు.

శర్వానంద్ మాట్లాడుతూ ” ‘కో అంటే కోటి’ అనే సినిమాను ప్రొడ్యూస్ చేశాను. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో నిర్మాతగా బాగా నష్టపోయాను. ఆ అప్పులు తీర్చడానికి ఆరేళ్ళు పట్టింది. బంధువులు కూడా దూరమయ్యారు. ఆ సమయంలో నేను కొత్త షర్ట్ కూడా కొనుక్కోలేదు. అలా చాలా ఇబ్బందులు పడ్డాను. ఇక వరుస ఫ్లాపులతో ఉన్న టైంలో ‘రన్ రాజ రన్’ హిట్టయింది. రిలీజ్ రోజు రాత్రి ప్రభాస్ అన్న పార్టీ ఇచ్చాడు. తను సినిమా హిట్ అంటే నేను నమ్మలేదు. సోమవారం రోజు మాట్లాడుకుందాం అనేశాను. ఆ తర్వాత ‘ఎక్స్ ప్రెస్ రాజా’ కి కూడా అలానే జరిగింది ప్రభాస్ అన్న ఆ సినిమా సూపర్ హిట్ అంటుంటే సోమవారం డిసైడ్ చేద్దాం అన్నాను. బేసిక్ గా నాకు మండే సిండ్రోం ఉంది (నవ్వుతూ). అందుకే ఏ సినిమా అయినా ఫ్రైడే హిట్ అంటే నమ్మలేను సోమవారమే డిసైడ్ అవుతా” అని చెప్పుకున్నాడు.

ఈ ఇంటర్వ్యూలో శర్వా చెప్పిన విషయాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సెప్టెంబర్ 9న శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో సూపర్ హిట్ కొడతాననే ధీమాతో ఉన్నాడు శర్వా.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics