శర్వానంద్ హీరోగా శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. మరో రెండు రోజుల్లో సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా యూనిట్ ఓ స్పెషల్ ప్రీమియర్ షో వేసి కొంత మంది సెలెబ్రిటీస్ కి సినిమాను చూపించారు. ముఖ్యంగా ఈ షోకి అక్కినేని కుటుంబం హాజరై స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సినిమాలో అక్కినేని అమల శర్వానంద్ అమ్మ పాత్రలో నటించింది. అందుకే స్పెషల్ షో కి అమలతో పాటు కొడుకు అఖిల్ తో కలిసి వచ్చాడు కింగ్ నాగార్జున.
అలాగే దర్శకుడు హను రాఘవపూడి , చందూ మొండేటి, మేర్లపాక గాంధి, వెంకీ కుడుముల , వివేక్ ఆత్రేయ , శ్రీరాం ఆదిత్య , వసిష్ఠ , వెంకీ అట్లూరి , భరత్ కమ్మ హాజరై సినిమా అనంతరం టీంను అభినందించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఈ ప్రీమియర్ షో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఎమోషనల్ సీన్స్ మనసుకి హత్తుకునేలా ఉన్నాయని ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలిగిందని విచ్చేసిన వారందరూ యూనిట్ తో తమ ఫీడ్ బ్యాక్ షేర్ చేసుకున్నారు.

డ్రీం వారియర్ పిక్చర్ బేనర్ పై ప్రకాష్ బాబు , SR ప్రభు నిర్మించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. శ్రీ కార్తిక్ డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ మాటలు అందించాడు. అన్ని కార్యక్రామాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్స్ లోకి రానుంది.
*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics