Oke Oka Jeevitham - ఫస్ట్ వీకెండ్ సూపర్ హిట్

Tuesday,September 13,2022 - 03:05 by Z_CLU

శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది ఒకే ఒక జీవితం సినిమా. రోజురోజుకు ఈ సినిమాకు వసూళ్లు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా నిన్న ఆదివారం రోజున ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అలా మొదటి వారాంతానికి ఈ సినిమా 3 కోట్ల 22 లక్షల రూపాయల షేర్ సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 7 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మారు. తాజా వసూళ్ల ప్రకారం ఈ మూవీ సగం బ్రేక్ ఈవెన్ సాధించినట్టయింది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో, ఇకపై ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా ఈజీ. అంతేకాదు, మంచి లాభాలు కూడా అందుకునే అవకాశం ఉంది.

శర్వానంద్, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు శ్రీకార్తీక్ దర్శకత్వం వహించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో నాజర్ కీలక పాత్ర పోషించాడు.

విడుదలైన ఈ 3 రోజుల్లో ఒకే ఒక జీవితం సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – 1.65 కోట్లు
సీడెడ్ – 24 లక్షలు
ఉత్తరాంధ్ర – 33 లక్షలు
ఈస్ట్ – 23 లక్షలు
వెస్ట్ – 18 లక్షలు
గుంటూరు – 24 లక్షలు
నెల్లూరు – 14 లక్షలు
కృష్ణా – 21 లక్షలు