ఇదో కొత్త కాంబినేషన్ గురు.

Friday,July 07,2017 - 05:14 by Z_CLU

సంక్రాంతి కి ‘శతమానం భవతి’ తో గ్రాండ్ హిట్ కొట్టి లేటెస్ట్ గా ‘రాధా’తో థియేటర్స్ లో సందడి చేసిన యంగ్ హీరో శర్వానంద్ లిస్ట్ లో మరో డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. ఇటీవలే డైరెక్టర్ దశరథ్ తో పాటు శ్రీకాంత్ అడ్డాల కూడా శర్వా కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసాడని శర్వా ని కూడా సంప్రదించారనే వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ గట్టిగానే వినిపించాయి. అయితే ఇప్పుడు శర్వా తో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఆల్మోస్ట్ ఈ ప్రజెంట్ సెట్ అనే టాక్ వినిపిస్తుంది.

సిద్దార్థ్ -శృతి హాసన్ జంటగా ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన ప్రకాష్ కోవెలమూడి ఆ తర్వాత అనుష్క హీరోయిన్ గా ‘సైజ్ జీరో’ అనే సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రకాష్ లేటెస్ట్ గా ఓ స్క్రిప్ట్ రెడీ చేయించాడని ఈ సినిమాకు శర్వా కు జంటగా కీర్తి సురేష్ ని ఫైనలైజ్ చేయనున్నాడని టాక్. ప్రెజెంట్ మారుతి డైరెక్షన్ లో ‘మహానుభావుడు’ అనే సినిమా చేస్తున్న శర్వా నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేస్తే తప్ప ఈ సినిమా పై క్లారిటీ రాదు. మరి శర్వా నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసేదెప్పుడో..?