ఎన్టీఆర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న దర్శకేంద్రుడు.

Friday,July 07,2017 - 05:46 by Z_CLU

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు-జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఎలాంటి సంబంధం ఉందో అందరికీ తెలిసిందే.. వీరిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోయిన్ప్పటికీ వీళ్ళ రిలేషన్ షిప్ ఓ రేంజ్ ఉంటుందని టాలీవుడ్లో అందరికీ తెలుసు. అయితే లేటెస్ట్ గా తారక్ నటిస్తున్న ‘జై లవకుశ’ సినిమాలో జై క్యారెక్టర్ తో ఉండే ఓ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ అయిన వెంటనే టాలీవుడ్ లో ఆల్మోస్ట్ అందరి ప్రశంశలు అందుకున్నఈ టీజర్ పై లేటెస్ట్ గా తన ఒపీనియన్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు రాఘవేంద్ర రావు.


టీజర్ లో ఈ రావనుడ్ని చంపాలంటే ధ ధ ధైర్యం ఉండాలి ఉందా.. అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. ఈ డైలాగ్ తోనే టీజర్ పై తన ఒపీనియన్ చెప్పాడు దర్శకేంద్రుడు. “ఇలాంటి పాత్రలు చేయాలన్నా ధ ధ.. ధైర్యం కావాలి.. మా తారక్ కి ఉంది. నేనూ ఎదురు చూస్తున్నా ఆ ధైర్యాన్ని తెర మీద చూడడానికి.” అంటూ టీజర్ పై స్పందిస్తూ నటుడిగా ఎన్టీఆర్ ధైర్యం గురించి కొనియాడాడు. రాఘవేంద్రరావు.