ఆ డైరెక్టర్ తో శర్వా ఫిక్స్...?

Sunday,May 21,2017 - 01:03 by Z_CLU

లేటెస్ట్ గా రాధా సినిమాతో థియేటర్స్ లో సందడి చేసిన శర్వానంద్ నెక్స్ట్ సినిమా ను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘మహానుభావుడు’ అనే సినిమాలో నటిస్తున్న శర్వా దశరథ్, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే వీరిద్దరూ తన కోసం కథలు రెడీ చేస్తున్నారని కానీ ఇంకా నేను వాళ్ళ దగ్గర కథలు వినలేదని చెప్పిన శర్వా సుధీర్ వర్మతో మాత్రం త్వరలోనే ఓ సినిమా ఉంటుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు శర్వా.. సో ‘కేశవ’ తో మరోసారి హిట్ ట్రాక్ లో నిలిచిన సుధీర్ కె శర్వా ఓటేసే ఛాన్స్ ఉండనే టాక్ వినిపిస్తుంది.