షారుక్ ఖాన్ కొత్త సినిమా ‘జీరో’

Tuesday,January 02,2018 - 01:05 by Z_CLU

షారుక్ ఖాన్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్ స్టోరీ లైన్ రివీల్ కాలేదు కానీ ఇంట్రెస్టింగ్ టీజర్ తో రిలీజ్ అయిన ఈ టైటిల్ షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా సర్ ప్రైజ్ చేసేసింది. బాలీవుడ్ సిజిలింగ్ బ్యూటీస్ కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ మరుగుజ్జులా కనిపించనున్నాడు.

అల్టిమేట్ కామెడీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ టీజర్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ పర్ఫెక్ట్ ట్రీట్ అనిపించుకుంటుంది. ఇప్పటికే యూ ట్యూబ్ లో 3 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన ఈ టీజర్, డిసెంబర్ 21, 2018 ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకుంది.

ఆనంద్ L రాయ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌరీ ఖాన్ నిర్మిస్తుంది. జామ్ 8, అజయ్ – అతుల్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.