స్పెషల్ సాంగ్ కి రెడీ అవుతున్న పూజ హెగ్డే

Tuesday,January 02,2018 - 03:15 by Z_CLU

క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో మెగా స్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ సినిమాలో పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి స్టేజికి చేసుకున్న ఈ సినిమా రేపటి నుంచి ఫైనల్ షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని సన్నివేశాలతో పాటు పూజ హెగ్డే పై స్పెషల్ సాంగ్ షూట్ చేయబోతున్నారు యూనిట్.

దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ స్పెషల్ సాంగ్ లో పూజ హెగ్డే తో పాటు రామ్ చరణ్ మిగతా నటీ నటులపై షూట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ కి సంబంధించి రిహార్సల్స్ జరుగుతున్నాయని, ఈ సాంగ్ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై విలేజ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా మార్చ్ 30 న గ్రాండ్ గా విడుదల కానుంది.